జననము , విద్యఆధ్యాత్మిక జీవితం



భగవంతుని ప్రేపరణతో , భగవంతుని సేవకై ఎక్కడో, ఏదో ఒక కార్యానికి, ఏదో ఒక లక్ష్యముతో , ఎదో ఒక శరీరాన్ని ఒకచోట పుట్టిస్తాడు, ఒకరిని పుట్టిస్తాడు, అనుగ్రహిస్తాడు , అలానే ఈ శరీరము ఈ శరీరము పూర్వాశ్రమములో “శ్రీరామ్” అని, తురీయ ఆశ్రమమునందు పరమహంస పరివ్రాజక సంన్యాసిగా “గోవిందానంద సరస్వతీ” అనే అభిధేయత్వముతో పిలవబడుతున్న ఈ శరీరము, ఎంతకాలము ఈ భూమిపై ఉండునో అంతకాలము పాంచా భౌతికమైన ఈ శరీరము
:______________________________:: సంక్షిప్తము::______________________________:

పూర్వాశ్రమ నామము : శ్రీ పుత్సా శ్రీరామ్,
గోత్రము : గౌతమాస గోత్రము ,
జన్మ తిథి : జననం ( 10 మార్చి 1978) ఫాల్గుణ శుక్ల పక్ష, ప్రతిపద,
జన్మ స్థలము : గంగలకుర్రు , ( అంబాజీపేట అమలాపురం తూర్పుగోదావరి జిల్లా , ఆంద్ర ప్రదేశ్ )
తల్లి దండ్రులు: పుత్సా శ్రీ లక్షి దేవి, శ్రీ పుత్సా సత్య సూర్య నరసింహ ప్రభాకర శాస్త్రి గారు ,
తాతగారైన (తల్లి గారి తండ్రి) ఊరు బ్రహ్మగారు వేద బ్రహ్మ శ్రీ భమిడిపాటి వెంకటేశ్వరుల గారు, శ్రీ లక్షమ్మమ్మగార్ల కుమార్తె “శ్రీ లక్ష్మీదేవి” , గౌతమాస గోత్రులు ( ద్రాక్షారామము ప్రక్కన కుయ్యేరు వాస్తవ్యులు ఆకెళ్ల రామారావుగారికి పుత్రులు వంశానికి చెందినవారు “
పుత్సా సత్య సూర్య నరసింహ ప్రభాకర శాస్త్రి గారికి దంపతులకు ద్వితీయ పుత్రునిగా మీనరాశి శుభలగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్ర మందు ఉదయము 3 గంటలకు ఫాల్గుణ శుక్ల పక్ష, ప్రతిపద లో జననము ,
ఉపనయనము : శృంగేరి మఠములో ,
ప్రాథమిక విద్యా :శృంగేరి మఠములో
ఉన్నత విద్యా : సంస్కృత , వేద, వేదాంత, వేదాంగ , వేదాంత విద్వత్ , ఉపనిషద్, భగవత్గీతా, బ్రహ్మసూత్రాది , శాస్తార్థ , ఆది శంకరాచార్య గురుపరంపరా బ్రహ్మవిద్యా పరంపరగా అద్వైత తత్వ శాస్త్ర విద్యా : బదరి జ్యోతిర్మఠ, ద్వారకా శారదా పీఠ, జగద్గురు శంకరాచార్యులు ధర్మసామ్రాట్ స్వామి శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారు
బ్రహ్మచారి దీక్షా : 2010 లో వసంతపంచమీ పర్వదినమున ఆమ్నాయ పీఠ నైష్టిక బ్రహ్మచారి దీక్షా : బదరి జ్యోతిర్మఠ, ద్వారకా శారదా పీఠ, జగద్గురు శంకరాచార్యులు ధర్మసామ్రాట్ స్వామి శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివాచే
పరమహంస పరివ్రాజక సంన్యాసి దీక్షా : 2013 లో ప్రయాగరాజ్ లో మహాకుంభములో మౌనీ అమావాస్యా రోజున బదరి జ్యోతిర్మఠ, ద్వారకా శారదా పీఠ, జగద్గురు శంకరాచార్యులు ధర్మసామ్రాట్ స్వామి శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారు

:______________________________:: విస్తారము::______________________________:

జననం ( 10 మార్చి 1978) ఫాల్గుణ శుక్ల పక్ష, ప్రతిపద, గంగలకుర్రు , అంబాజీపేట అమలాపురం తూర్పుగోదావరి జిల్లా , ఆంద్ర ప్రదేశ్ లో భగవత్సేవకై వారి తాతగారైన (తల్లి గారి తండ్రి) వేద బ్రహ్మ శ్రీ భమిడిపాటి వెంకటేశ్వరుల గారి ఊరు బ్రహ్మగారి ఊరులో గౌతమాస గోత్రులు ( ద్రాక్షారామము ప్రక్కన కుయ్యేరు వాస్తవ్యులు ఆకెళ్ల రామారావుగారికి చెందిన, వంశానికి చెందినవారు శ్రీ పుత్సా సత్య సూర్య నరసింహ ప్రభాకర శాస్త్రి, శ్రీ లక్షి దేవి గారి దంపతులకు ద్వితీయ పుత్రునిగా మీన రాశి శుభలగ్నము ఉత్తరాభాద్ర నక్షత్ర మందు ఉదయము 3 గంటలకు ఫాల్గుణ శుక్ల పక్ష, ప్రతిపద లో జననము ,

నామకరణము : వైదిక సాంప్రదాయ మున యజుర్వేద తైత్తిరీయ స్వశాఖా గౌతమస గోత్రులుగా త్రయా ఋషేయులైన వైదిక సాంప్రదాయ “పుత్సా” వంశానికి చెందిన శరీరానికి “శ్రీరామ్” గా నామకరణము,

గంగలకుర్రు గ్రామము : ఏకాదశ రుద్రుల నిలయస్థానము, వైదిక నిత్యాగ్ని హోత్రుల నిత్య నిలయము, ఘన శిఖరముల విద్వత్ మణుల దివ్య సీమ కోన సీమ , వేద సీమ కోన సీమ , నిత్యాగ్నిహోత్రుల నిలయ సీమ, అటువంటి పరిసరములలో , అటువంటి వైదిక కుటుంబములో , బాల్యము , ఆ భగవంతుడు ఎవరిని ఎప్పుడు ఎందుకు దేనికి పుట్టిస్తాడో ఎవరికీ తెలియదు , కానీ ఇటువంటి వేదాలకు పుట్టినిల్లుగా వైదిక సంస్కారములకు నిలయమైన వేద భూమిలో ఆ భగవంతుడు ఈ శరీరాన్ని అనుగ్రహించాడు , గంగాలకుర్రు జన్మస్థానము ఇది వారి తాతగారి ఇల్లు వేద బ్రహ్మ శ్రీ భమిడిపాటి వెంకటేశ్వరులుగారు ఊరి గ్రామమునందు బ్రహ్మగారు


బాల్యము : అదే వేద సీమ కోన సీమ , నిత్యాగ్నిహోత్రుల నిలయ సీమ లో వారి మధ్యే , ఏకాదశ రుద్రుల , ప్రభల తీర్థముల ఉత్సవములలో బాల్యము, గంగలకుర్రు గడిచినది జరిగినది, తండ్రిగారి ఊరు కుయ్యేరు గ్రామము, , తండ్రి గారు కుయ్యేరు పాఠాశాలలో ఉపాధ్యాయులుగా , అనేక పాఠాశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా అనేక మందికి విద్యాదానం, ఇది వారి పూర్వజులనుండి వచ్చిన విద్యాదాన సంస్కారము, తరువాత కాకినాడ లో,  

విద్య : ప్రాథమిక పాఠశాల కుయ్యేరు,కాకినాడ, పటవల,  కళాశాల – కాకినాడ (ఆంధ్రా)లో తదనంతరము ఉన్నత విద్యకై (2000) కర్ణాటక బెంగళూరు గమనము, బాల్యమునుండి నిత్యాగ్నిహోత్రుల మధ్య , నిత్యా వేదం ఘోష తో విరాజిల్లే విరసిల్లె ఘనాపాఠీల గ్రామములో శ్రవణ సంస్కారము , పూర్వజన్మ సంస్కారముతో బాల్యమునుండే వైదిక సంస్కారములతో పెరిగిన వీరికి భగవద్గీత పైన ఎక్కువ మక్కువ 

తీర్థ క్షేత్రాల దర్శనం, అదేరకముగా ఈ జీవి యొక్క ఆధ్యాత్మిక యాత్ర కూడా అనాది , ఈ శరీరములో ప్రస్తుత జన్మ లో ఈ యాత్ర కి అంకురార్పణ ఏకాదశరుద్రులు దివ్యాసాన్నిధ్యము గంగాలకుర్రు నుండి ఆరంభము ఆధ్యాత్మిక సాధన విద్యా,  తత్వ అన్వేషణము ,

ఆధ్యాత్మిక జీవితం: జీవి ప్రయాణం అనేది అనాది , అనేక శరీరాలు దాటుతూ పూర్వజన్మసంస్కారాలతో 84 లక్షల జీవరాసులలో కొన్ని కర్మ ను అనుసరించి కొన్ని భగవంతుని ప్రేపరణతో ఆయన కార్యమునకై జన్మని ఒక శరీరాన్ని పొందుతాయి ,  బాల్యము నుండి ఆరాధ్యదైవము శ్రీ కృష్ణ పరమాత్మ , భగవద్గీత యందు తన్మయత్వము , శృంగేరి యాత్ర జగద్గురువుల దర్శనము,

ఉపనయనము : శృంగేరి లో ఉపనయన సంస్కారం, సమస్తమును వదలి వసంతపంచమి సంపూర్ణ ఆధ్యాత్మిక జీవనమునకు సర్వమూ వదలి కట్టుబట్టలతో శృంగేరి పయనము , వేద, సంస్కృత అధ్యయనము, శ్రీ సద్విద్యా సంజీవనీ సంస్కృత వేద పాఠశాల లో ప్రాథమిక అధ్యయనము, శ్రీ శంకరాద్వైత సంశోధనా కేంద్రము లో సంశోధనా కార్యము ,

శృంగేరి లో యతి సమ్మేళనము దక్షిణభారత యాత్ర : శృంగేరి లో యతి సమ్మేళనము, మొట్టమొదటి సారిగా ఒకేసారి అనేక మంది సన్యాసుల దర్శనం, తీర్థ క్షేత్రాల దర్శనం, ఆధ్యాత్మిక సాధన విద్యా,  తత్వ అన్వేషణము , మహాపురుషులకు సేవ, అనేక మఠాల, అనేక ఆశ్రమాల , క్షేత్రముల దర్శనం (2004),

పంపాక్షేత్ర హంపి గమనము : దక్షిణభారత యాత్రా సమయములో (2005) పంపాక్షేత్ర కిష్కిందా హంపి గమనము పరమేశ్వరుడు శ్రీ పంపా విరూపాక్షేశ్వర స్వామివారి దర్శనము , విద్యా విజయనగర సామ్రాజ్య సంస్థాపకులు, చతుర్వేద భాష్య కర్త శ్రీ జగద్గురు విద్యారణ్యులవారి సమాధి దర్శనము , 31 కోట్ల శ్రీ పంపాక్షేత్ర వైభవ దర్శనము , ఎన్నో దేవస్థానాలు , త్రేతాయుగమునాటి దివ్య కిష్కిందా నగరము ఇప్పటికీ అలానే ఉన్నది , క్షేత్ర సేవ అనుగ్రహము , క్షేత్ర వాసము ” అహో భాగ్యం అహో భాగ్యం పంపాక్షేత్రస్య వైభవం “ స్కాంధపురాణాంతర్గత శ్రీ హేమకుట ఖండాత్మక శ్రీ సప్తర్షి ప్రకాశికాయాత్ర శ్రీ పంపాపూరాణము అధ్యయనము, భగవాన్ వేదవ్యాసులు జాబాలాది మహర్షులకు అధ్యయన అధ్యాపనలు చేసి వేదం వ్యాస గురుకుల ఆశ్రముమును స్థాపించినది ఇక్కడే ఒరుగులు వరంగల్ రాజధానిగశ్రీ విద్యారణుల జన్మస్థానము 1000 సంవత్సరాల కాకతీయనగర సామ్రాజ్యము పతనము తరువాత అక్కడనుండి మాధవాచార్యులు సాయణాచార్యులు ఇద్దరు అన్నదమ్ములు ఇదే పంపాక్షేత్రానికి వచ్చి స్థిరపడిన , వారి తపస్సుతో భువనేశ్వరి అమ్మవారి అనుగ్రహముతో “కనక వృష్టి” ని కురిపించిన, మొట్టమొదటి హిందూ మహా సామ్రాజ్యమును స్థాపించినది ఇక్కడే చతుర్వేదములకు భాష్యములు వ్రాసిన , పంచదశి ఇత్యాది దివ్య గ్రంథములు వ్రాసిన శ్రీ అది శంకర భగవతపాదులవారి దివ్య చరిత్రము శ్రీ మాధవీయం శంకర విజయము వ్రాసిన సజీవంగా సశరీరంగా గుహాప్రవేశము చేసిన దివ్య అధిష్టానము గల ప్రదేశము ఇదే, భగవంతుని ప్రేపరణతో ఏ ప్రదేశము లో 5300 సంవత్సరాల క్రితము కాశి నుండి భగవాన్ వేదవ్యాసులవారు ఈ పంపాక్షేత్రము నాకు వచ్చి వేద వేదంగా , శాస్త్ర, సనాతన ధర్మ పరిరక్షణకై ఆశ్రమ గురుకులమును స్థాపించిరో కాలప్రభావముతో అది జీర్ణము ఆవటముతో , మరల ఆ వైదిక సంస్కృతి పరిక్షణకి శ్రీ స్వామివారు ఆ గురుకులమును జీర్నోద్దరముచేసి పున : ఆరంభము చేసినారు

శ్రీ రామసేతు పరిరక్షణాసేవాభాగ్యము : శ్రీ పంపా విరూపాక్షేశ్వర స్వామివారి, శ్రీ సీతా రామచంద్రుల వారి, అంజనీసుత శ్రీ కిష్కిందా హనుమంతుల వారి అనుగ్రహము శ్రీ రామసేతు పరిరక్షణాసేవాభాగ్యము, ( త్రేతాయుగమున శ్రీ రామచంద్రులవారు వనవాసగమనమున సుగ్రీవ మైత్రికి, రావణ సంహారమునకై కాలికినాడకతో చిత్రకూటము , పంచవటి నుండి వచ్చినది ఇక్కడికే , మొట్టమొదటి సారిగా శ్రీ రాములవారు శ్రీ హనుమంతులవారిని కలుసుకొన్నది , శ్రీ హనుమంతులవారి జన్మ స్థలము ఇదే , నాలా నీలు లతో జాంబవతా మహాభాగవతులతో లంకకు బయలుదేరి మార్గములో రామేశ్వరమునందు రామసేతు నిర్ణమానము చేసినది దానికి మూల స్థానము ప్రణాళిక ఏర్పడినది ఇక్కడే) అటువంటి పంపాక్షేత్రము కిష్కిందా నగరంలోనే ఉండి శ్రీ రామసేతు పరిరక్షణకు తగిన ఆధారాలు సంగ్రహించి సుప్రీం కోర్ట్ లో సమర్పణచేసి స్టే పొంది శ్రీ రామసేతువు పరిరక్షణకు కార్యము ఆరంభము ఇక్కడనుండే

బదరి,  ద్వారకా జగద్గురు శంకరాచార్యులవారి దర్శనం : మొట్టమొదటిసారిగా  బదరి,  ద్వారకా జగద్గురు శంకరాచార్యులవారి దర్శనం, ఇంద్రప్రస్థ నగరం (ఢిల్లీ లో) సుప్రీం కోర్ట్ కి వెళ్లిన్నప్పుడు , అక్కడ న్యాయవాదులతో సమావేశము సమయయములో , ముందర మార్గదర్శనమునకుజగద్గురువులతో  శ్రీరామసేతు సేవ పై చర్చ, వారి అనుగ్రహము, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ దక్షిణ భారత దేశ యాత్ర,

4 ఆమ్నాయ పీఠాల 3 జగద్గురువుల సమ్మేళనము : బెంగుళూరు లో 4 ఆమ్నాయ పీఠాల 3 జగద్గురువుల సమ్మేళనము, జగద్గురువుల సాన్నిధ్యము సేవాభాగ్యము,

శ్రీరామసేతు సేవ : చతురామ్నాయ పీఠసమ్మేళనము సమయములో మధ్యలో ఢిల్లీ నుండి ఫోన్ సుప్రీం కోర్ట్ లో రామసేతు గురించి కేసు విచారణ ఉన్నదని తక్షణమే శ్రీ రామసేతువుకి సంబంధించిన ముఖ్యమైన కాగితాలు కావాలని విద్యానంద భారతి స్వామి వారి నుండి ఫోన్శ్రీ రామసేతు విషయమై రామేశ్వరము , శ్రీ రామసేతు దర్శనము , అక్కడ అధికారులతో చర్చ , మరియూ యునెస్కో వారితో చర్చ, ఢిల్లీ లో రాష్ట్రపతి భవనము లో కూడా సమావేశము చెన్నై , ఢిల్లీ , సుప్రీంకోర్టు లో పత్రాలు సమర్పణ , సేవ, శ్రీ విద్యానంద భారతి స్వామివారు – శ్రీ రామసేతు పరిరక్షణ, అకస్మాత్తుగా విద్యానంద భారతి వారి బ్రహ్మైక్యము


 శ్రీ శివగంగా  తపశ్చక్రవర్తుల శ్రీ సచ్చిదానంద భారతి స్వామివారి సాన్నిధ్యము, ఆయనకు సేవాభాగ్యము, తపస్సు, సన్యాస ఆశ్రమ ధర్మ బోధ, శాస్త్రం వైదిక సంప్రదాయ బోధ అనుగ్రహము,   మైసూరు చాతుర్మాస సమయములో బదరి, ద్వారకా జగద్గురువుల నుండి “బ్రహ్మచారి శ్రీరామ్” పిలుపు ,

బదరి, ద్వారకా జగద్గురువుల నుండి పిలుపు : కొలకత్తా లో జగద్గురువుల సాన్నిధ్యము “బ్రహ్మచారి శ్రీరామ్”  కు ధర్మ పరి రక్షణ కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయుటకు చాతుర్మాస్యములో సత్సంగము జగద్గురువుల  ఆదేశము, పరమపూజ్య శ్రీ అమృతానంద సరస్వతి స్వామివారి మొదటి దర్శనము, జగద్గురువుల ఆదేశము పూరి గమము : బదరి, ద్వారకా జగద్గురువుల ఆదేశము తో పురి గమము శ్రీ పూరి గోవర్ధన పీఠ జగద్గురు శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి స్వామి వారి దర్శనము, 4 ఆమ్నాయ పీఠ 3 జగద్గురువుల శృంగేరి, పూరి,  బదరి, ద్వారక అధికారిక లేఖలు (09-08-2009),

శ్రీ కాశీక్షేత్ర గమనము : 2500 సం ఆది శంకరాచార్యుల వారి పరంపర, పీఠాలు సంరక్షణకు జగద్గురువుల  ఆదేశము, కాశీ మొదటి శాస్త్ర సభకు (2009) పంపుట  “శ్రీ శంకరాచార్య మీమాంస” అనే పుస్తకాన్ని రచించమని జగద్గురువుల ఆదేశము,కాశీ విద్వత్ పరిషత్ విద్వాంసులు తో చర్చ


బదరి ద్వారక జగద్గురువుల సేవలో  (2006 నుండి ), బ్రహ్మచారి శ్రీరామ్ గా ఉన్నప్పుడు బెంగళూరులో చతురామ్నాయపీఠ సమావేశ సమయములో ఉన్నప్పుడు జగద్గురువులు మొట్టమొదటిగా ఈ జీవుడిని అడిగిన ప్రశ్న , ఏమిటి సన్యాసి అవ్వాలనుకుంటున్నావా ?
మా సమాధానము : మీ ఆశీర్వాదము, మీ అనుగ్రహము ఉంటే అప్పటినుండి అప్పటినుండి సాక్షాత్ జగద్గురువులులే బ్రహ్మచారికి నిత్య పాఠము ఆరంభము, ప్రతి రోజు ఉదయము 5.00 నుండి 7.00 వరకు విశేష పాఠము ప్రారంభము, ఒక పక్కన సేవ , ఒకపక్కన పాఠము ,

శ్రీరామసేతువు పై పరమహంసి ఆశ్రమం లో జగద్గురువుల సన్నిధిలో మణిద్వీపములో ఆంతరంగిక చర్చ సుప్రీం కోర్ట్ న్యాయవాదులతో,

శ్రీ విద్యానంద భారతి బ్రహ్మైక్యము : అకస్మాత్తుగా శ్రీ విద్యానంద భారతి బ్రహ్మైక్యము శ్రీ రామ సేతువు సేవలో ఈయన జన్మ ధన్యము

బదరి ద్వారక జగద్గురువుల చే వారి సాన్నిధ్యములో ఉన్నత వేదాంత శాస్త్ర అధ్యయనం : బదరీ ద్వారకా జగద్గురువుల దివ్య సాన్నిధ్యములో అద్వైత తత్వ,  ఉన్నత వేదాంత శాస్త్ర అధ్యయనం ,ఉపనిషత్ , బ్రహ్మసూత్ర , భగవద్గీత , శ్రీ శాంకర భాష్య శాస్త్ర అధ్యయనం,

శ్రీ గోవిందనాథ  వనంలో తపస్సు : జగద్గురువుల ఆదేశముతో ( శ్రీ ఆదిశంకరాచార్య వారి క్రమ సన్యాస దీక్షా స్థలం నర్మదానది తీరములో శాఖల ఘాట్ శంకర ఘాట్ లో శ్రీ గోవింద భగవతపాదులవారి వనములో , గుహలో తపస్సు ) ( 2009 – 2010), శ్రీ శంకరభగవత్పాదులవారికి శ్రీ గోవిందభగవతపాదులవారు పరంపరానుగత పరమహంస పరివ్రాజకా సన్యాసం ఆశ్రమమును అనుగ్రహించి వారి గురువులైన శ్రీ గౌడపాదాచార్యులవారి అనుగ్రహముతో బ్రహ్మవిద్యాపారంపర అద్వైత తత్వమును , యోగ విద్యను అనుగ్రహించినది ఇక్కడే ,

నైష్ఠిక బ్రహ్మచారి దీక్ష : నైష్ఠిక బ్రహ్మచర్య దీక్షకు జగద్గురువుల ఆదేశము , జబల్పూర్ జో ఒకరోజు ఉదయము శాస్త్ర పాఠము చెబుతూ , ఆమ్నాయ పీఠ ధర్మములు , సన్యాసం ధర్మములపై శాస్త్రార్థము చర్చా సమయములో , సాక్షాత్ జగద్గురువులే ఆదేశాము నీకు త్వరలోనే ఆమ్నాయ పీఠ బ్రహ్మచర్య దీక్ష ఇవ్వాలనుకుంటున్నాము అని , అప్పటివరకు తపస్సుకై శ్రీ గోవిందభగవతపాదులవారి ఆశ్రమమునకు పంపుట, 2010 వసంతపంచమి బదరీ ద్వారకా జగద్గురువుల చే మఠామ్నాయ మాహనుశాసన పరంపరాగత ఆమ్నాయపీఠ బ్రహ్మచారి “ఆనంద” జగద్గురు శంకరాచార్య ఆమ్నాయ పీఠ బ్రహ్మచారి దీక్ష ( బుధవారము , 20 జనవరి, 2010 ) , అద్వైత తత్వ  ఉన్నత వేదాంత శాస్త్ర అధ్యయనం :

హరిద్వార్ మహాకుంభము, 2010 హరిద్వార్ మహాకుంభము, జగద్గురువుల ఆదేశాలతో వారితోనే 2010 హరిద్వార్ మహాకుంభము,

కేరళ కాలటి యాత్ర : శ్రీ ఆది శంకరాచార్యుల జన్మస్థలమున కుంభాభిషేక మహోత్సవము

పరమహంసి గంగా ఆశ్రమములో సభ: జగద్గురువులతో చర్చ ఆమ్నాయ పీఠ బ్రహ్మచర్య దీక్ష సంప్రదాయముపై విచారణ ,

గురువు ఆదేశంతో 3 సంవత్సరాల భారత యత్రా : మధుకరి భిక్ష అనేక గురుకులముల సందర్శనము, అధ్యయనము వేద వేదాంగాది శాస్త్రముల, ఉపనిషత్ వేదాంతముల , ప్రస్థానత్రయ స్వాధ్యాయము, అధ్యాపనము,

తురియ ఆశ్రమ స్వీకార అనుగ్రహము : జన్మ సాఫల్యము , జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారిచే తురియ ఆశ్రమ స్వీకార అనుగ్రహము, పీఠ జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారిచే పరంపరా వేదాంగాది శాస్త్రముల, ఉపనిషత్ వేదాంతముల అధ్యయనము, పరమహంస పరివ్రాజక సన్యాస దీక్ష బదరీ ద్వారకా జగద్గురు జీ ద్వారా, గాయత్రి పునశ్చరణము , జగద్గురువులచే “గోవిందానంద బ్రహ్మచారి”కి సన్యాసం ధర్మములు విశేష పాఠము , పీఠ పరంపరానుగత నియమములు, విశేషముగా 6 నెలలు పరమహంస పరివ్రాజక నియమములను అనుసరించి యతిదండ నిర్మాణము , యతి ధర్మ సాధనా , ఆమ్నాయ బ్రహ్మవిద్యా పరంపరగా, శాస్త్రార్థములు ,

2013లో – ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో ఉత్తరామ్నాయ బదరీ పీఠ , పశ్చిమామ్నయ ద్వారకా శారదా పీఠ జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారిచే గోవిందానంద బ్రహ్మచారికి త్రివేణీసంగము ప్రయాగలో సరస్వతి ఘాట్ , యమునా నది యందు మనకామేశ్వర దేవస్థానమునందు పరమహంస పరివ్రాజక సన్యాసం దీక్షా, జగద్గురువులతో పరమహంసి ప్రయాణము ,

సన్యాస దీక్షా, శాస్త్ర ప్రమాణం,

శివగంగా తపశ్చక్రవర్తులు శ్రీ సచ్చిదానంద భారతి స్వామివారు బ్రహ్మైక్యము ,

పంపాక్షేత్ర జీర్ణోద్ధరణ పునర్నిర్మాణ భూమి పూజ : 2013 శ్రీ స్వామీజీ ద్వారా పంపాక్షేత్ర “విజయనగర హంపి” నూతన గ్రామ స్వర్ణహంపి గ్రామ నిర్మాణ పునర్నిర్మాణ భూమి పూజ,
https://swarnahampi.org/services/
https://kishkindha.org/en_US/pampa-kshetra-renovation-project/

ఐతిహాసిక కేరళా యాత్ర : తన దీక్షా గురువు జగద్గురువులతో కలిసి 17-03-2015 శ్రీ ఆదిశంకరాచార్యుల జన్మస్థలాన్ని సందర్శనము . 

ఉన్నత వేద వేదాంత విద్యా  అధ్యయనాలు బదరీ  ద్వారకా జగద్గురు శంకరాచార్య  వద్ద శాస్త్ర  అధ్యయనము శాస్తార్థములు విద్వత్ సభ  ధర్మ సంసద్,  కోల్   కత్తా   పరమహంసి గంగా ఆశ్రమం ద్వారక  హరిద్వార్  బృందావన్ దీక్షా గురువులతో పూజ్య జగద్గురు జీతో పాటు చాతుర్మాస్య వ్రతాలు.

ఉత్తరామ్నాయ బదరీ జ్యోతిర్మఠం “తోటకాచార్య గుహలో” ,  ద్వారకా శారదా పీఠంలో , శ్రీ స్వామీజీ చారిత్రక చాతుర్మాస్య వ్రతము,

శ్రీ అయోధ్యా శ్రీ రామజన్మభూమి లో శిలాన్యాస , యంత్రప్రతిష్ఠా , కుంభ అభిషేకము : శ్రీ అయోధ్యా శ్రీ రామజన్మభూమి లో శిలాన్యాసానికి జగద్గురువులు శ్రీ అయోధ్య కి పంపుట ,అయోధ్యలో శిలాన్యాసమునకు కిష్కింధ శ్రీ హనుమద్ జన్మభూమి నుండి అయోధ్యకి శిలలు , ప్రయాగరాజ్ లో శిలలకి జగద్గురువులు విశేష పూజ https://kishkindha.org/en_US/shila-poojan-yantra-pratishtha-in-ayodhya-2019/

విజయ యాత్రలు ధర్మ సభలు : సనాతన ధర్మానికి సేవ , అవైదిక ఖండనం అవైదిక మతాల ఖండనకు మహారాష్ట్ర, నాసిక్ , షిరిడి , కాశి , హరిద్వార్ , ప్రయాగరాజ్ , ద్వారకా ,

గో సంరక్షణకు కేరళ : కేరళలో గోసంరక్షణా యాత్ర : కేరళా లో కొంతమంది విధర్ములు గోమాతను అవమానిస్తూ చేసిన అధర్మ కార్యమును ఖండిస్తూ గోవిందానంద సరస్వతి స్వామివారు తమ పూజ్య గురుదేవుల ఆదేశముతో ద్వారకా లో గోపాష్టమి పూజ నిర్వహించి అక్కడనిండి కేరళా కు వెళ్లి అనేక గ్రామాలలో గోమాత సంరక్షణకు గోపూజలు నిర్వహించుట యాత్ర,

మఠామ్నాయ మహానుశాసనము ఆమ్నాయ పీఠం , పరంపర రక్షణ : 2532 సంవత్సరాల ఆది శంకరాచార్యుల పరంపర రక్షణ. https://badarijyotirmath.org/mathamnaya-mahanushasanam/

శ్రీ రామసేతు పరిరక్షణా ,  శ్రీ రామజన్మభూమి పరిరక్షణా , పంపాక్షేత్ర కిష్కిందా శ్రీ హనుమద్ జన్మభూమి జీర్ణోద్ధార పునర్వైభవ మహత్కార్యము ,బదరీ , ద్వారకా,పీఠ సంరక్షణా కార్యములు, :

దక్షిణ భారత దేశములో విజయ యాత్ర : శ్రీ గోవిందానంద సరస్వతి స్వామివారు తమ పూజ్య దీక్ష గురువులు జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారితో దక్షిణ భారతదేశములో దిగ్విజయ యాత్ర , ఆంధ్రా విద్వత్ పరిషత్ , కర్నాటకా విద్వత్ పరిషత్ , తెలంగాణా విద్వత్ పరిషత్ ల స్థాపన , ఏకశిలానగర వరంగల్ నందు 1000 సం ఐతిహాసిక కాకతీయనగర సామ్రాజ్య జీర్ణోద్దార పునర్వైభవం కార్యక్రమముల శిలాన్యాసము , నూనత హంపి స్వర్ణహంపి గ్రామ వైభవ కార్యక్రమములు ,శ్రీ హనుమద్ జన్మభూమి  విజయ యాత్ర: శ్రీ హనుమద్ జన్మభూమి విషయములో సంపూర్ణ భారతదేశములో విజయ యాత్ర : https://badarijyotirmath.org/digvijayayatra/

జగద్గురువులతో శాస్త్రార్థ చర్చ , ఉపనిషత్ లు , వాటి ప్రమాణము , వేంకటేశ తపన్యుపనిషద్ ప్రమాణము పై సంపూర్ణ చర్చ, శృంగేరి, పూరీ జగద్గురువులతో , కాంచీ స్వామివారితో , మణిద్రావిడ , గారితో , మహేశ్వరన్ తో చర్చలు , 108 ఉపనిషత్ ల ప్రమాణ నిరూపణము , అవైదిక అప్రామాణ్యపు ఉపనిషత్ ల నిరాకరణ , https://badarijyotirmath.org/shastartha/


పూజ్యగురుదేవుల బదరి ద్వారకా పీఠ జగద్గురువులు బ్రహ్మైక్యము: పూజ్యగురుదేవుల బదరి ద్వారకా పీఠ జగద్గురువులు బ్రహ్మైక్యము 11-09-2022 మధ్య ప్రదేశ్ లో పరమహంసి గంగా ఆశ్రమము లో చాత్రుమాస్య వ్రతము పూర్తిచేసుకుని – పూజ్యగురుదేవుల చాతుర్మాస్యము వ్రతము 99 సంవత్సరముల వర్ధంతి మహోత్సవము పారమహంసి గంగా ఆశ్రమములో,

కాశ్మీర్ యాత్ర : పూజ్య గోవిందానంద సరస్వతి స్వామివారు వారి గురుపరంపరా అనుసారముగా ధర్మ పరిరక్షణ కార్యములో విశేషముగా కాశ్మీర్ లో పర్యటన, వివిధ ప్రదేశాలలో పురాతన దేవస్థానాల జీర్ణోద్ధారము , శ్రీ నగర్ లో గల శ్రీ ఆది శంకరాచార్యులవారి పర్వతము దేవస్థానమునందు శ్రీ ఆది శంకరాచార్యులవారు పంఛధాతు ఉత్సవ మూర్తి ప్రతిష్ఠ , మానసబల్ నందు దివ్య గుహలో ప్రకటితమైన శ్రీ మానస మహాదేవ్ భగవాన్ పునర్వైభవమునకు కార్యములు, కాశ్మీర్ పండితులతో నవరాత్రులు ఆరంభము , ఆది శంకరాచార్యులు 2500 సం క్రితము కాశ్మీర్ లోని అధిరోహించిన శ్రీ శారదా అమ్మవారి దివ్య మూల స్థానము శ్రీ శారదా సర్వజ్ఞపీఠము ( ప్రస్తుతము పీ.ఓ.కె. ఉన్న ) మూల స్థానమును జీర్ణోద్దారము చేయుటకు ఎల్.ఓ.సి నందు శిలాన్యాసము , 75 సంవత్సరాలు తరువాత నవరాత్రులు ఆరంభము , శ్రీనగర్ లాల్ చౌక్ లో దీపావళి మహోత్సవములు ఆరంభిచుట , 20 సంవత్సరాలుగా మూతపడిన శ్రీ హనుమంతులవారి మందిరమును తెరచి పున: జీర్ణోద్ధార కార్యములు ఆరంభము చేయుట, కాశ్మీర్ లో విజయ యాత్ర , ధర్మ ప్రచార పరిరక్షణ కార్యములు, పురాతన దేవస్థానముల జీర్ణోద్ధార కార్యములు

బదరీ ద్వారకా పీఠాల రక్షణ :తన పూజ్య గురుదేవులు బదరీ ద్వారకా పీఠాల రక్షణ, https://badarijyotirmath.org/imp-documents-historical-letters/

శృంగేరి మఠ ప్రక్షాళనము : కారణము ఆది శంకరాచార్యులువారు 2500 సం క్రితము కేరళా లోని కాలడి గ్రామమునందు అవతారము పొంది ధర్మ పరిరక్షణకు 4 ఆమ్నాయ పీఠములును స్థాపించి శ్రీ కేదార్నాథ్ క్షేత్రమందు నిర్వాణము పొందిరి సశరీరముగా కైలాసమునకు వెళ్లిరి,కానీ శృంగేరి మఠము ఇప్పటికి కూడా మా మఠము 1200 సం క్రితము స్థాపించినది అని చెప్పుచున్నారు ఇది అసాధ్యము ఎందుకు అనగా ద్వారకా, పురి , బదరి 2500 సం క్రింద స్థాపన చేస్తే , మరి 1200 సం క్రింద ఏరకంగా ? ఈ విషయాలు పై చాలాకాలము నుండు శ్రీ గోవిందానంద సరస్వతి స్వామివారు శృంగేరి వారిని ఎన్ని సార్లు అడిగినా ఏ ప్రశ్నకు సరి అయిన సమాధానము ఇవ్వలేదు , ఇవ్వటము లేదు

విజయ యాత్రలు , శాస్త్రార్థాలు , అవైదిక మత ఖండనము ఆధ్యాత్మిక జీవనంలో కలుసుకొన్నది ఎంతమందినో మహానుభావులను , కూడలి శృంగేరి శ్రీ విద్యాభినవ వాలుకేశ్వర భారతి , శ్రీ సచ్చిదానంద భారతి, శ్రీ భీమానంద భారతి, శ్రీ రామానంద భారతి, శ్రీ సచ్చిదానంద సరస్వతి, కారపాత్రి స్వామివారి శిష్యులు ఎంతమందో దక్షిణ భారతదేశము నుండి ఉత్తరభారతమువరకూ పశ్చిమము నుండి పూర్వ భారతదేశము వరకు , ఇది జీవుని అనాది ప్రయాణము, నిజముగా జీవుడు ప్రయాణము చేయునా , ఆత్మకు గమనాగమనములు ఉన్నావా? దృక్ దృశ్య వివేకము తెలిసిన విషయము అవగతముకాగలదు , మరి సత్యము ఏమిటి ? నేను ఎవరు? జీవుడు ఏమిటి , బ్రహ్మ ఏమిటి ? తెలుసుకునేవాడు ఎవడు? తెలుసుకునేది ఏమిటి , అంతిమముగా ప్రయాణము చేసేది నేను కాదు ,శుద్ధ మైన చైతన్యము, ఆత్మ కాలాతీతము దానికి గమనా ఆగమాములు లేవు అవి ప్రతీతి మాత్రమే , అంతిమ సత్యము నాహం కర్తా నాహం కారయితా , జీవో బ్రహ్మైవ నా పరః,


Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Latest

Revival of Ancient Glories of Pampakshetra Kishkindha Hampi, Capital of Pampapattana, Kishkindha, Vidya, Vijayanagara Empire : and New Creation Second Phase Inaugurated on Vasant Panchami (23 Jan 2026)

Sri Lakshmi Narasimha New Vigrah in Pampakshetra Swarna Hampi – Upcoming Heritage Reconstruction

Today During Vaikhunta Ekadashi North Entrance Darshan at Sri Hanumad Janmabhoomi Kishkindha Anjanadri Kishkindha

Sringeri Math Math Prakshalanam