Paramahamsa Parivrajaka Sanyasi – Deekshita Shishya of Badari Dwaraka Peetha Jagadguru Shankarachaya Ji
“ఈషణత్రయములు” అనగా మూడు రకాలైన కోరికలు లేదా ఆసక్తులు అని అర్థం. ఇవి దారైషణ, ధనైషణ, మరియు పుత్రైషణ. ఇవి మానవ జీవితంలో ముఖ్యమైనవి మరియు వాటిపై మమకారం పెంచుకోవడం వలన బంధనాలు ఏర్పడతాయి, ఒకసారి వీటిని దాటి సన్యాసము తీసుకున్నతరువాత లోకముతో వారికి ఏమి సంబంధము ఉండదు , ఉండకూడదు , కానీ ఎప్పటివరకు ఈ శరీరము తన ప్రారబ్ధకర్మను అనుసరించి నడుస్తూ ఉంటుందో అప్పటి వరకు నడుస్తుంది అటువంటి ఈ శరీరము గురించి ఎవరైనా తెలుసుకోవాలి అని అంటే వారికి జిజ్జ్ఞాసకై
ముందు మాటలు శ్రీ గోవిందనాద సరస్వతి స్వామివారి గురించి శరీరము గురించి తెలుసుకొనేముందు , తెలుసుకునేది ఎవరు, తెలియబడేది ఏమిటి , ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోదగిన విషయము శ్రీ గోవిందానంద సరస్వతి అయితే కాదు , ఈ వెబ్ సైట్ అందుకు కాదు ,
ఒకవేళ శ్రీ గోవిందానంద సరస్వతి స్వామివారి గురించి తెలుసుకుందామా అంటే అది ఇప్పుడే అంటే ఆ శరీరము సన్యాసము తరువాత వచ్చిన ( ఒక పేరు అనకూడదు అది “అభిధేయత్వము ” అనాలి ) ఎందుకంటే సన్యాసులకు పేరు ఉండదు ఓకే సంకేతము మాత్రమే, సరే మరి తెలుసుకోవలసినది ఏ “అభిధేయత్వము ” ఈశరీరమును తెలియ జేస్తున్నదో దానిని గురించి తెలుసుకోవాలి , అయితే , అది కూడా ప్రయోజనముకాదు ఎందుకంటే అదే శరీరము పూర్వాశ్రమములో శ్రీరామ్ అనే పేరుతొ పిలవబడినది కానీ ఆతరువాత పెరుమాదిరిపోయినది , అంతేకాదు శరీరము కూడా ఆరు వికారాలు లేదా శరీరం యొక్క మార్పులు: అస్తి (ఉనికి), జయతే (పుట్టుక), వర్ధతే (వృద్ధి), విపరిణమతే (మార్పు), అపక్షియతే (క్షయం), వినశ్యతి (మరణం). అనేది సత్యము ఇప్పుడు గోవిందానంద సరస్వతి గడించి తెలుసుకోవాలా శ్రీరామ్ గురించి తెలుసుకోవాలా ? ఇంకాముందరకి వెళితే , ఈ శరీరము గంగలకుర్రులో పుట్టినప్పుడు దీనికి పేరే లేదు , పోనీ పేరు వదలి శరీరము గురించి తెలుసుకోవాలి అనిన , అప్పుడు ఉన్న శరీరము ఇప్పుడులేడు ఇప్పడు ఉన్న శరీరము అప్పుడు లేదు ఇది నిరంతరమూ విపరిణమతే (మార్పు) మార్పు చెందుతూనే ఉన్నది ఏ ఒక్క క్షణములోను శాశ్వతమైన వస్తువుగా నిలకడ లేనిది నిరంతర జననము , నిరంతర మరణము , నిత్య పరివర్తనమైనది